NANDYAL June27 :- భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా పట్టణంలోని టేక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల వద్ద ఏర్పాటు చేసిన సీళ్లను కలెక్టర్ పరిశీలించారు.

ఈవీఎంల భద్రతకు సంబంధించి చేపట్టే రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలు, 24/7 సర్వేలెన్స్ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని వారు సమగ్రంగా సమీక్షించారు. అదే విధంగా గోదాము పరిసరాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేసి తనిఖీలను అధికారికంగా నమోదు చేశారు.

ఈవీఎంల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. భద్రతా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగించాలని, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిఆర్ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాధ్, తాసిల్దార్ సత్య శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మనోహర్ కలెక్టర్ వెంట వున్నారు.

అలాగే రాజకీయ పార్టీల తరపున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి సయ్యద్ రియాజ్ భాష, టిడిపి పార్టీ ప్రతినిధి శివరామిరెడ్డి, వైయస్సార్సీపి పార్టీ ప్రతినిధి సాయిరాం రెడ్డి, బిజెపి పార్టీ ప్రతినిధి కె.చంద్రశేఖర్, బిజెపి పార్టీ ప్రతినిధి నరసింహ, జనసేన పార్టీ ప్రతినిధి రవికుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ప్రదీప్ కుమార్ హాజరై పర్యవేక్షణలో పాల్గొన్నారు.
Arattai