NANDYAL :- నంద్యాలలోని బిజెపి కార్యాలయం వద్ద జనత వారిది కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి స్వాతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగజ్జనని నగర్ కు చెందిన దివ్యాంగుడు మహేష్ తనకు సొంత గృహం లేదని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తనకు గృహాన్ని మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారం పై జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగా దివ్యాంగుడి అభ్యర్థన మేరకు తనకి సొంత గృహాన్ని మంజూరు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కసెట్టి చంద్రశేఖర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai