NANDYAL May29:- నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం రాజకీయ రిజర్వేషన్ ప్రకటించిన నారా లోకేష్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ నంద్యాల తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథిగా సంబరాల్లో పాల్గొని కేక్ కట్ చేసి జిల్లా మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపి నారా లోకేష్ గారికి ధన్యవాదములు తెలియజేశారు.

ఈ సందర్భంగా గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా నిలిచిందని పేర్కొన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పూర్తిస్థాయిలో అమల్లోకి రాకముందే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని మహానాడులో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.

మహిళల అభ్యున్నతికి విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, భద్రత వంటి అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. గతంలో మహానేత నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తి హక్కుల్లో సమాన వాటా కల్పించి మహిళా గౌరవాన్ని పెంచారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు, మహిళ సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది మహిళలకు ఆర్థిక బలోపేతం కల్పించారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఆమె వివరించారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా 12 లక్షల స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ సుమారు 1.12 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తున్నట్లు తెలిపారు. బ్యాంక్ లింకేజీ ద్వారా మహిళలకు వేల కోట్ల ఆర్థిక సహాయం అందుతోందని పేర్కొన్నారు.

అలాగే “ స్త్రీ శక్తి” పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం మహిళల గౌరవాన్ని మరింత పెంచిందన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళలకు నాయకత్వ అవకాశాలు కల్పించడమే టీడీపీ లక్ష్యమని గౌరు చరిత రెడ్డి గారు తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో మహిళలు మరింత ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజా సేవలో కీలక పాత్ర పోషించాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలకు ఇచ్చిన 33% రిజర్వేషన్ హామీ భవిష్యత్ రాజకీయాల్లో మహిళలకు స్వర్ణయుగానికి నాంది అవుతుందని పేర్కొన్నారు.మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించడంతో నంద్యాల మహిళా టీడీపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మెన్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ జిల్లెల్ల శ్రీదేవి,జిల్లా కమిటీ సభ్యులు ప్రసన్న రెడ్డి,సౌభాగ్యవతి, నంద్యాల మహిళ విభాగం అధ్యక్షురాలు విజయ గౌరీ, బైరెడ్డి శంకరమ్మ, పద్మావతి,భారతి రెడ్డి, నాగ రత్నమ్మ మరియు మహిళ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai