NANDYAL May29:- కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ, లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత లలిత కళల వేసవి శిక్షణ శిబిరం “కళా సాధన 20 26 “ముగింపు ఉత్సవం శుక్ర వారం సాయంత్రం స్థానిక ఎన్.టి.ఆర్. మున్సిపల్ టౌన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంస్కృతి సృజనాత్మక కమిషన్ సహకారంతో ఘనంగా నిర్వహించారు.

కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవి కృష్ణ ల నిర్వహణలో జరిగిన ఈ ముగింపు వేడుకలలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి,ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ లయన్స్ క్లబ్ సమాఖ్య మాజీ చైర్మన్ ఎవిఆర్ ప్రసాద్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతి రెడ్డి తులసి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, నటరాజ విగ్రహానికి పూలమాల వేసి ఉత్సవాలు ప్రారంభించారు.శిక్షణ ఇచ్చిన కోచ్ లకు అతిధులు జ్ఞాపికలు, శాలువలతో సత్కరించారు. శిక్షణ పొందిన 400 బాలబాలికలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో కళా రంగ వైభవానికీ, చిన్నారులలో కళల పట్ల ఆసక్తి పెంచి ప్రోత్సహిస్తున్న కళారాధన సాంస్కృతిక సంస్థ సేవలు నంద్యాల చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు.వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ పిల్లలకు కళల పట్ల ఆసక్తిని పెంచడం అవసరమన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడి తట్టుకుని ప్రశాంతంగా, మానసిక ధైర్యంతో విజయాలు సాధించాలంటే కళలు,క్రీడల పట్ల ఆసక్తి కలిగి పాల్గొనడం ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.

తాతి రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ నెల రోజులపాటు పిల్లలకు ఉచితంగా వివిధ కళలలో శిక్షణ ఇవ్వడం అభినందనీయం అన్నారు.కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు,డాక్టర్ రవికిష్ణ,క్యాంపు కోఆర్డినేటర్ రంగనాథ్, కావ్య నిర్వాహక కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరాలు నిర్వహించడం ఇది 25 వ సంవత్సరం అని ప్రతి ఏటా 300 నుండి 400 మంది బాలబాలికలకు 25 మంది శిక్షకులతో 20 రకాల అంశాలలో నెలరోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి శిక్షణానంతరం వారితో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమం పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నామని, వీటికి సహకరిస్తున్న నంద్యాల వైద్యులకు, పట్టణ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు.

సభానంతరం శిక్షణ పొందిన బాలబాలికలు ప్రదర్శించిన శాస్త్రీయ, ఆధునిక నృత్యాలు, శాస్త్రీయ, ఆధునిక గానాలాపన, వాద్య సంగీతం, పద్య పఠనం, సంస్కృత శ్లోకాలు,కరాటే, తైక్వాండో ప్రదర్శనలు అహుతులను విశేషంగా అలరించాయి.ఈ కార్యక్రమంలో కళారాధన నిర్వాహక కార్యదర్శి రవి ప్రకాష్ , శ్రీకాంత్, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ ,లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు, జోన్ చైర్మన్ నిజాముద్దీన్, కళారాధన కార్యవర్గ సభ్యులు డిసిపి శర్మ, శిక్షకులు రజాక్,లలితా సరస్వతి, కళ్యాణి, సుహాసిని వెంకటేష్ బాబు, గణేష్, ప్రజ్వల, సతీష్,శివరామిరెడ్డి, సుదర్శన్, రాజేంద్ర,మధు, మజీద్, వెంకటేశ్వర్లు, సూర్య ,పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు
Arattai