NANDYAL June05:- నంద్యాలలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రతి శుక్రవారం ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని,సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు తెలిపారు.

మున్సిపల్ వాటర్ లైన్ సక్రమంగా లేక స్థానిక ప్రజలు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,సమస్యను పరిష్కరించాలని క్రాంతినగర్ ప్రజలు కోరారు.పత్తి మిల్లు ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు వాలిపోయి ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వాటిని వెంటనే మరమ్మతులు చేయవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుమోమిన్ షబానా, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శికశెట్టి చంద్రశేఖర్,జిల్లా ఉపాధ్యక్షులు పసపుల రవీంద్ర కుమార్,గోస్పాడు మండల అధ్యక్షులు మధు గోపాల్,రిషికేష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు
Arattai