NANDYAL June13:- నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అర్హులైన దివ్యాంగులకు, వయో వృద్ధులకు తానున్నానన్న భరోసా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి ఇస్తున్నారు.
భారత ప్రభుత్వం ఏ డి ఐ పి పథకం క్రింద ఎ ఎల్ ఎం సి ఓ ద్వారా దివ్యాంగులకు సహాయ పరికరాలు, వయో వృద్ధులకు సీనియర్ సిటిజన్ల సంక్షేమశాఖ ఎ పి డి ఏ ఎస్ సి ఏ సి పథకం ద్వారా సహాయక పరికరాలు ఈ నెల 15 వ తేదీన సోమవారం ఉదయం 11 గంటలకు నంద్యాల టెక్కె వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చేతుల మీదుగా పంపిణికి ఏర్పాట్లు చేశారు.
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారు నిర్ధారించిన షెడ్యూల్ ప్రకారం, భారత ప్రభుత్వ ADIP పథకం కింద, ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ALIMCO) సహకారంతో, అవసరమైన దివ్యాంగులకు వివిధ సహాయ పరికరాలు, ఉపకరణాలు ఉచితంగా అందించడానికి, గత ఏడాది 28-06-2025 నుండి 18-07-2025 వరకు నంద్యాల జిల్లాలోని 07 అసెంబ్లీ నియోజకవర్గాలలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అసెస్మెంట్ క్యాంపులు నిర్వహించారు. ఆ ప్రత్యేక శిభిరాల్లో అర్హులైన దివ్యాంగులు, వయో వృద్ధులను గుర్తించి వారికి అవసరమైన పరికరాలు సుమారు రూ. 4 కోట్ల విలువగల, 3 వేల మందికి పైగా లబ్ధిదారులకు అవసరమైన పరికరాలు ఇప్పటికే నంద్యాల గోదాములకు చేరుకున్నాయి. వాటిని ఈ నెల 15 వ తేదీ నంద్యాల టెక్కె వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబందించిన యంత్రాంగం ఏర్పాట్లు చేసి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.
Arattai