NANDYAL June20 :- నంద్యాల నెరవాడ: స్థానిక శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సుబ్రహ్మణ్యం గారు తెలిపారు.యోగా అనేది కేవలం ఆసనాలు కాదు.. మన జీవన విధానం, ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఒక ఘనమైన కార్యక్రమం. శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్ A G వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ఏడాది “ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగ” (Yoga for Healthy Ageing) అనే ప్రధాన ఇతివృత్తంతో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆరోగ్యంగా జీవించడానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యాలను పెంపొందించడంలో, శ్వాస కోస సంబంధమైన ఆరోగ్యం కోసం రకరకాల ప్రాణాయామాలు, బ్రీథింగ్ ఎక్సర్సైజులు వాటికి యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా అందమైన శరీరాన్ని కూడా పొందవచ్చని, యోగా మన జీవితంలో భాగమవ్వాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఓ డి లు, ఫాకల్టీ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.
Arattai