NANDYAL June21 :- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని అమర యోగ వికాస కేంద్రం నందు నిర్వహించిన కార్యక్రమంలో 72 సంవత్సరాల వయస్సు గల రిటైర్డ్ ఉద్యోగి వెంకటసుబ్బయ్య తన అద్భుతమైన యోగా ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు.ప్రముఖ యోగాచార్యులు పాములేటి స్వామి శిష్యుడైన వెంకటసుబ్బయ్య, ఎంతో కఠినమైన యోగా ఆసనాలలో ఒకటైన లోలాసనంను సులభంగా ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

ఈ వయస్సులోనూ నిత్య యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఏకాగ్రతను కొనసాగిస్తున్న వెంకటసుబ్బయ్య యువతకు ఆదర్శంగా నిలిచారు. యోగా సాధనకు వయస్సు అడ్డంకి కాదని ఆయన తన ప్రదర్శన ద్వారా నిరూపించారు.

కార్యక్రమంలో పాల్గొన్న యోగా సాధకులు, ప్రజలు వెంకటసుబ్బయ్యను అభినందిస్తూ, ఆయన క్రమశిక్షణతో కూడిన యోగా సాధన అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అమర యోగ వికాస కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Arattai