NANDYAL June21 :- నంద్యాల పట్టణంలోని యోగ చైతన్య కేంద్రంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగ మాస్టర్ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సూర్య నమస్కారాలు, వివిధ ఆసనాలు, ధ్యానం నిర్వహించారు.

ఈ సందర్భంగా యోగ మాస్టర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, యోగా సాధనను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆనందకర జీవనం సాధ్యమవుతుందని తెలిపారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి మార్గమని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాచుర్యం పొందేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, శిక్షకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.
Arattai