NANDYAL June23 :- ఐక్యరాజ్యసమితి ప్రజాసేవ దినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ కు ప్రయాణికుల సౌకర్యార్థం చక్రాల కుర్చీలు రెండు అందజేశారు.నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, దాతలు నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు భవనాసి నాగ మహేష్ లు చక్రాల కుర్చీలు రైల్వే స్టేషన్ మేనేజర్ చంద్రశేఖర్ కు అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ నిరంతర సేవా కార్యక్రమాలను గత 56 సంవత్సరాలుగా చేస్తున్నదని భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు.ఆత్మకూరు సుదర్శనం శెట్టి, భవనాసి నాగ మహేష్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందజేస్తామని తెలిపారు.రైల్వే స్టేషన్ మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దివ్యాంగులకు, వృద్ధులకు ఈ చక్రాల కుర్చీలు చాలా ఉపయోగపడతాయని అన్నారు. లయన్స్ క్లబ్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మాస్టర్ చంద్రశేఖర్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ గెలివి సహదేవుడు,లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ మరియు రైల్వే క్రూ కంట్రోలర్ రవి ప్రకాష్, లోకో పైలట్ రామన్న, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, లయన్స్ క్లబ్ సభ్యులు ఎంపీవి రమణయ్య, లయన్స్ క్లబ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ యూసుఫ్,నూతన కార్యదర్శిగా ఎంపికైన మేడా చంద్రశేఖర్, పారిశ్రామికవేత్త ఆత్మకూరు రవి పాల్గొన్నారు.
Arattai