NANDYAL June28 :- నంద్యాల పట్టణంలోని దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రమణయ్య ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన నాయకులు దేశ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన దూరదృష్టి గల నాయకుడిగా పీవీ నరసింహారావును కొనియాడారు. అలాగే నంద్యాల నియోజకవర్గానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించారు.
దివ్యాంగుల సంక్షేమానికి ఆయన ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను స్మరించుకుంటూ, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి పీవీ నరసింహారావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణయ్య లైన్స్ క్లబ్ సభ్యులు నాగరాజు చంద్రమోహన్ సురేష్ చంద్రశేఖర్ రామయ్య శ్రీనివాసరెడ్డి కళారాధన సభ్యులు శివరామిరెడ్డి బాలచంద్రుడు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు
Arattai