NANDYAL May06 :- సంచార, దళిత, పీడిత కులాల పిల్లల చదువే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యమని, బేడ బుడగ జంగం కులానికి తెలుగుదేశం పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.బుధవారం నంద్యాల వై ఎస్ ఆర్ నగర్ లోని బేడ బుడగ విద్యార్థుల వసతి గృహంలో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి కార్యక్రమంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ ను తాను చిన్నప్పటి నుంచి చూస్తున్న, తన కులం బాగుకోసం నిరంతరం పనిచేస్తున్నాడని అభినందించారు. పిల్లల భవిష్యత్ కోసం మనోహర్ లాంటి వారు అవసరం అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బేడ బుడగ జంగం ఎస్ సి రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో రెండు సార్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపారని, తాను బేడ బుడగ జంగం ఎస్ సి రిజర్వేషన్ కోసం రెండు సార్లు పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లానని, టీడీపీ మీకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భరోసా ఇచ్చారు. బిక్షాటనతో సంచార జాతి బిడ్డల చదువుకు దూరంగా ఉంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్రంలోనే మొట్ట మొదటగా ప్రత్యేకంగా బుడగ జంగాల అర్బన్ రెసిడెన్సీ వసతి నంద్యాలలో ప్రభుత్వ ఏర్పాటు మంచి పరిణామం అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ మాట్లాడుతూ పార్లమెంట్ లో బేడ బుడగ జంగం కులానికి ఎస్ సి రిజర్వేషన్ కోసం కృషి చేయాలని, నంద్యాల వసతి గృహంకు ప్రభుత్వం స్థలం కేటాయించి శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని, అర్బన్ రెసిడెన్సీయల్ వసతిని అర్బన్ పదం కాకుండా రెసిడెన్సీయల్ గా మార్పుకు చర్యలు తీసుకువాలని, విద్యార్థులకు మినరల్ వాటర్ ఫ్లాంట్ మంజూరు చేయాలని కోరగా వెంటనే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబ్దరి స్పందించి జిల్లా కలెక్టర్ ద్వారా 40 సెంట్ల ప్రభుత్వ స్థలం వసతి గృహంకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని, ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ఫ్లాంట్ మంజూరు చేస్తున్నామని, బిక్షాటన మాని ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అవరోధించాలని, ఇక్కడ చదివి ఇటీవల 10 వ తరగతి పరీక్షల్లో 450 మార్కులు సాధించిన విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలని, మీకు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని టీచర్స్, విద్యార్థులను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఎంపీ, డి ఈ ఓ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్వ శిక్ష ప్రాజెక్టు కో – ఆర్డినేటర్ నిత్యానందరాజులు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, ఆప్కాబ్ రాష్ట్ర మాజీ చైర్మన్ బి ఎస్ నవీన్ కుమార్, బేడ బుడగ జంగం రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు, ఎస్ సి, ఎస్ టి మానిటరింగ్ కమిటీ సభ్యురాలు ఎరుకల రాజేశ్వరమ్మ, హాస్టల్ నిర్వాహకులు గడ్డం సుబ్బారాయుడు. జమ్మన్న తదితరులు పాల్గొన్నారు.
Arattai