NANDYAL May06 :- ళారాధన సాంస్కృతిక సంస్థ ప్రతిఏటా మే నెలలో కళా సాధన పేరిట నిర్వహించే ఉచిత లలిత కళల శిక్షణ శిబిరం కరపత్రాలు, పోస్టర్స్ రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవి కృష్ణ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కళారాధన సాంస్కృతిక సంస్థ గత 25 సంవత్సరాలుగా విద్యార్థులకు వేసవిలో ఉచితంగా లలిత కళలలో శిక్షణ ఇవ్వడమే కాకుండా వారితో ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నారని,ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని వేలాది విద్యార్థులకు అనేక అంశాలలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసి వారిలో ఉన్న సృజనాత్మక శక్తుల్ని గుర్తిస్తున్నారని, అనేక పద్య, సాంఘిక, బాలల నాటకాలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వ నంది ఉత్సవాలలో, రాష్ట్రవ్యాప్తంగా పరిషత్తులలో ప్రదర్శించి వందలాది బహుమతులు తీసుకువచ్చి నంద్యాల కళా వైభవాన్ని రాష్ట్ర, దేశవ్యాప్తంగా తీసుకువెళ్లారని ప్రశంసించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నెలరోజుల ఉచిత శిక్షణ తర్వాత జూన్ రెండవ తేదీ ఎన్టీఆర్ పురపాలక టౌన్ హాల్లో శిక్షణ పొందిన వారి చేత ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ డాక్టర్ రవి కృష్ణ కళా రంగానికి చేస్తున్న సేవలను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహమ్మద్ రఫీ, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి,ఐఎంఏ మహిళ విభాగం వైద్యులు డాక్టర్ మాధవి, డాక్టర్ వసుధ ,డాక్టర్ నర్మద,డాక్టర్ శైలజ, డాక్టర్ లలిత, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శులు అన్నెం శ్రీనివాసరెడ్డి, రంగనాథ్, సాహితీ విభాగం కార్యదర్శి డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, శిక్షణ శిబిరం కోచ్ లు శివకుమార్, నాగేంద్ర, మజీద్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Arattai