NANDYAL July10 :- నంద్యాల పట్టణంలో మన ఊరు–మన గుడి–మన బాధ్యత సంస్థ ఆధ్వర్యంలో “బిల్వ ప్రాజెక్ట్” పేరుతో బిల్వం మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుక్రవారం నవనందుల్లో ఒకటైన ప్రథమ నంది దేవస్థానంలో. దేవస్థానం చైర్మన్ చలం బాబు ఆధ్వర్యంలో బిల్వం మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ, ఆలయ పరిసరాలను పచ్చదనంతో నింపడంతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన బిల్వ వృక్షాలను సంరక్షించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వస్థానం చైర్మన్ చలం బాబు తెలిపారు. నవనందుల ఆలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో కూడా దశలవారీగా బిల్వం మొక్కలను నాటనున్నట్లు మన గుడి- మన బాధ్యత సంస్థ సభ్యులు శివ కుమార్ రెడ్డి తెలిపారు
ఆలయాల్లో బిల్వ వృక్షాల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రతినిధులు, మన ఊరు–మన గుడి–మన బాధ్యత సంస్థ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు
Arattai