NANDYAL July11 :- నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో శనివారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా సీనియర్ చదరంగం జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు.నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చదరంగం మేధో శక్తిని,ఏకాగ్రతను ఇనుమడింప చేస్తుందని అన్నారు.తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని కోరారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ వలన బాలలలో మానసిక వికాసం కలుగుతుందని,క్రీడలు విద్యార్థులలో గెలుపు ఓటములను స్వీకరించే మనస్తత్వం, ఓటమి చెందాక తిరిగి గెలవాలనే పట్టుదల పెంచుతాయని అన్నారు. నిరంతర సాధన ద్వారా చదరంగంలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు.

నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు నంద్యాల లో ఈనెల 18,19వ తేదీలలోజరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.డాక్టర్ రామకృష్ణారెడ్డి,డాక్టర్ రవి కృష్ణ చెస్ బోర్డుపై పావులు కదిపి చదరంగం పోటీలను లాంచనంగా ప్రారంభించారు. 200 మంది పైగా చదరంగం క్రీడాకారులు జిల్లా నలుమూలల నుండి వచ్చి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్, మేడా చంద్రశేఖర్, జోనల్ చైర్మన్ సోమేశుల నాగరాజు,చెస్ సంఘం సంయుక్త కార్యదర్శులు ఇమామ్, రాజా రమేష్ చక్రవర్తి, కోచ్ లు అరుణ్, మాలిక్ భాషా, సురేష్, అధిక సంఖ్యలో క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Arattai