NANDYAL July26 :- ఆదివారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధ వీరులను సత్కరించి, అమరులైన వీర సైనికులకు నివాళులర్పించారు.నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ అధ్యక్షతన, కార్యదర్శి మేడా చంద్రశేఖర్, కోశాధికారి సురేష్ ల నిర్వహణలో, సీనియర్ లయన్స్ సభ్యులు జి. రవి ప్రకాష్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులు శ్రీనివాసులు, మురళి లనుశాలువా, పూల మాల,జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ సేవా సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ పాల్గొని మాట్లాడుతూ 1999 లో కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించిన పాకిస్తాన్ సైనికుల్ని తరిమికొట్టి భారత ఆధీనంలోకి తెచ్చుకున్న ఈ రోజును కార్గిల్ విజయ దినోత్సవం గా నిర్వహించి, అమరులైన వీర సైనికులకు నివాళులర్పించి వారి త్యాగాలను మననం చేసుకుంటామని అన్నారు. వారి స్ఫూర్తిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని అన్నారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ సరిహద్దులలో అహర్నిశలు దేశాన్ని కాపాడుతున్న వీర జవాన్ల త్యాగాలు గుర్తుంచుకుని ,దేశ సమగ్రతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరులు శ్రీనివాసులు,మురళి మాట్లాడుతూ తాము కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నామని అయితే ఎందరో వీరుల ప్రాణ త్యాగం వల్లే కార్గిల్ ని మన ఆధీనంలోకి తెచ్చుకోగలిగామని అన్నారు.

ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న రవి ప్రకాష్ మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ ప్రతి ఏటా కార్గిల్ విజయ దివస్ రోజున మాజీ సైనికులను ఆహ్వానించి సత్కరించడం ప్రశంసనీయం అన్నారు. ఈ సందర్భంగా రవి ప్రకాష్ తన పుట్టినరోజు పురస్కరించుకుని దివ్యాంగులకు ఒక నెల మందుల పంపిణీ కోసం ఆర్థిక సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్మన్ నిజాముద్దీన్, లయన్స్ జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పీ.వీ.సుధాకర రెడ్డి, జోనల్ చైర్మన్ సోమేశుల నాగరాజు,సీనియర్ లయన్స్ సభ్యులు ఆంజనేయులు గుప్తా, బదిరి శెట్టి శ్రీకాంత్, రమణయ్య, చంద్రమోహన్,రోడ్డా సుంకయ్య,సాయి మనోజ్, రత్నకుమార్, అమిదల జనార్ధన్, చంద్రమోహన్, ఇమ్మడి రామకృష్ణుడు,తోట శ్రీనివాస్, సుహాస్ రాఘవ,రామయ్య పాల్గొన్నారు.
Arattai