NANDYAL :- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈర్నపాడు లో ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0’ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి మాధురి మేడం గారి అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించబడింది. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ అన్నెం ప్రతాపరెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ అన్నెం ప్రతాపరెడ్డి గారు మాట్లాడుతూ — “ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, ముఖ్యంగా ‘తల్లికి వందనం’ వంటి పథకాలు విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్యను ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి” అని పిలుపునిచ్చారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మాధురి గారు మాట్లాడుతూ — “మన పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు, వారి సమగ్ర వికాసానికి పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని సమర్థవంతంగా అందిస్తున్నాం. గత విద్యాసంవత్సరం పదో తరగతి ఫలితాల్లో మన పాఠశాల విద్యార్థి షమీర్ 582 మార్కులు సాధించి, మండలంలోనే అత్యుత్తమ ప్రతిభతో పాఠశాల ‘షైనింగ్ స్టార్’ గా నిలిచి గర్వకారణంగా నిలిచారు” అని పేర్కొన్నారు.కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా హాజరైన శ్రీ పవన్ కుమార్ గారు మాట్లాడుతూ — “విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలే కాకుండా నైతిక విలువలతో కూడిన బోధన అందించినప్పుడే వారు భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడి దేశాభివృద్ధికి పాటుపడతారు” అని దిశా నిర్దేశం చేశారు.ఈ వేడుకలో దాతలు మేడా నిరంజన్ గారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో మేము పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈర్నపాడు గ్రామ పెద్దలు పిట్టం రామకృష్ణారెడ్డి అన్నెం శ్రీనివాసరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai