NANDYAL July27 :- ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా బిజెపి జనతా వారధి పనిచేస్తుందని జిల్లా బిజెపి అధ్యక్షుడు అభిరుచి మధు తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన PGRS లో,ప్రజల నుంచి వచ్చిన సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు.ప్రతి శుక్రవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించే జనతా వారధి కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జినీ బాధ్యతగా తీసుకొని సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కశెట్టి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి కూరాకు భరత్, ఎస్సీ మోర్చ నాయకుడు బాలముని, వెంకటేశ్వర్లు నంద్యాల జిల్లా యువమోర్చా అధ్యక్షులు సిరివెరి వెంకట్ ఉపాధ్యక్షురాలు భవాని మహిళా మోర్చా నాయకురాలు అరుణ యూవ మోర్చా పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసు గౌడ్,దీరజ్,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Arattai