పోతిరెడ్డిపాడు నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలి: నంది రైతు సమాఖ్య
NANDYAL Aug03:- ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కారణంగా శ్రీశైలం డ్యామ్‌కు 849.7 అడుగుల నీటిమట్టం చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, ఎల్-నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేయాలని నంది రైతు సమాఖ్య డిమాండ్ చేస్తోంది.దీనివల్ల రాయలసీమ ప్రాంతంలో పంటల సాగుకు అవకాశం కల్పించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని సమాఖ్య అధ్యక్షులు * B.V.రామసుబ్బారెడ్డి, కార్యదర్శి M.V. కృష్ణారెడ్డి తెలిపారు.అదేవిధంగా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వ హయాంలో దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయకుండా కొనసాగించాలని వారు ప్రభుత్వానికి విన్నవించారు.రాయలసీమ రైతాంగం తరఫున ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామని, త్రాగునీరు, సాగునీరు కొరత లేకుండా ప్రజలకు రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Arattai