లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా డాక్టర్ రవికృష్ణ ప్రమాణ స్వీకారం
GOOTY Aug02 :- లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ లో నంద్యాల, కర్నూలు, కడప, అన్నమయ్య, తిరుపతి అనంతపురం, సత్యసాయి, నెల్లూరు జిల్లాల లయన్స్ క్లబ్ లో తో కూడిన లయన్స్ జిల్లా 316 జె లయన్స్ జిల్లా గవర్నర్ విరూపాక్ష రెడ్డి అధ్యక్షతన ఆదివారం గుత్తిలో జరిగిన నూతన క్యాబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం లో నంద్యాల కు చెందిన డాక్టర్ రవికృష్ణ తో రెండవ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ మాజీ అంతర్జాతీయ డైరెక్టర్ మదన్ మోహన్ పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. గూడూరు కు చెందిన వెంకటేశ్వరరావు ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా, గ్లోబల్ యాక్షన్ టీం చైర్మన్ లు గా రవి ప్రకాష్, సుధాకర్ రెడ్డి నంద్యాల కు చెందిన నిజాముద్దీన్, సూళ్లూరుపేటకు చెందిన డాక్టర్ ఆదిశేషారెడ్డి, రీజియన్ చైర్మన్ లు గా, నంద్యాలకు చెందిన సోమేశుల నాగరాజు తో పాటు 17 మంది జోన్ చైర్మన్ లు పదవి ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ రానున్న మూడు సంవత్సరాల లో లయన్స్ సేవా సంస్థ ద్వారా డిస్ట్రిక్ట్ 316 జె లో ఉన్న 50 కి పైగా క్లబ్బులలో, ఆయా క్లబ్బుల సభ్యుల సహకారంతో, గవర్నర్ విరూపాక్ష రెడ్డి, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావు లతో కలసి సేవా కార్యక్రమాలను ముమ్మరం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి లయన్స్ సీనియర్ నాయకులు అంబటి సుధాకర్ రెడ్డి, మూల్పూరు ఉపేంద్ర, ఆంధ్రప్రదేశ్ లయన్స్ సమాఖ్య మాజీ చైర్మన్ ఏ వి ఆర్ ప్రసాద్, డాక్టర్ గోపాలరావు, అనిల్ జైన్, పాపారావు, వేణుబాబు, గద్దె శేషగిరి,మాజీ లయన్స్ జిల్లా గవర్నర్లు నాగేశ్వరరావు, మాణిక్య ప్రభు,డి ఎస్ కుమార్, చిన్నపరెడ్డి, కిషోర్,రమేష్ నాద్ రెడ్డి, రామ చంద్ర ప్రకాష్, గౌతమ్, గోపాలకృష్ణ, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్, సీనియర్ సభ్యులు శ్రీకాంత్, రవి ప్రకాష్, సుధాకర్ రెడ్డి, నిజాముద్దీన్, సోమేశుల నాగరాజు,బైసాని రమేష్, మహేశ్వర్ రెడ్డి, చంద్రమోహన్, కసెట్టి చంద్రశేఖర్,ఇమ్మడి రామకృష్ణుడు, కన్నయ్య,జనార్ధన్, సురేష్,ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న 5 లయన్స్ జిల్లాల గవర్నర్లు,వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు, గ్రేటర్ రాయలసీమ లో ఉన్న 8 జిల్లాల పరిధిలోని లయన్స్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Arattai