నంద్యాల అర్బన్ మండల కార్యాలయ రికార్డు గది, కార్యాలయ నిర్వహణను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్
NANDYAL Aug01:- నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సూరజ్ ధనుంజయ్ శనివారం నంద్యాల అర్బన్ మండల కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి రికార్డు గది (రికార్డ్ రూమ్), కార్యాలయ నిర్వహణ, వివిధ శాఖలకు సంబంధించిన దస్త్రాల నిర్వహణను పరిశీలించారు.

ఈ సందర్భంగా రికార్డులను శాఖల వారీగా క్రమబద్ధంగా భద్రపరచాలని, పాత రికార్డులను నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యాలయంలోని ఫైళ్ల నిర్వహణ, రిజిస్టర్లు, కార్యాలయ పరిశుభ్రత, రికార్డుల భద్రత తదితర అంశాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
ప్రజలకు అందించే సేవల్లో పారదర్శకత, వేగం, సమర్థత పెంపొందేలా కార్యాలయ నిర్వహణ ఉండాలని, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు..ఈ తనిఖీలో నంద్యాల అర్బన్ తహసీల్దార్‌తో పాటు మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
Arattai