నంద్యాల పట్టణంలో ఘనంగా అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం
NANDYAL Aug07:- నంద్యాలలో శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ అమరావతి ఛాంపియన్షిప్-2026 నియోజకవర్గ స్థాయి పోటీలు ఘనంగా ప్రారంభించినట్లు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి MMV రాజు తెలిపారు.

ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా పాణ్యం మండల విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం పాల్గొన్నారు.ఈ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈనెల 20 నుండి 25 వరకు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు

ఈ సందర్భంగా అథ్లెటిక్స్ కబడ్డీ కోకో పోటీలు నిర్వహించారు సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏడు నియోజకవర్గాల వ్యాయామ ఉపాధ్యాయులు, ఇన్చార్జి లు,క్రీడా సంఘాల అసోసియేషన్ సభ్యులు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ లు మరియు పీడీలు పీఈటీలు పాల్గొన్నారు

Arattai