నంద్యాలలో భారతీయ జనతా యువమోర్చా (BJYM)జిల్లా స్థాయి సమావేశం
NANDYAL Aug07:- నంద్యాల పట్టణంలో భారతీయ జనతా యువమోర్చా (BJYM) జిల్లాస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు సిలివేరి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె.బి నర్సింగ్ రావు . బిజెపి జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు. జిల్లా కో ఇన్చార్జి ఏ కాశీ విశ్వనాథ్ మరియు యువమోర్చా రాయలసీమ జోనల్ ఇంచార్జ్ జి సుబ్బరాజు పాల్గొన్నారు .ఈనెల 22 23 వ తారీఖున విజయవాడలో యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగే వికసిద్భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ కార్యక్రమం యొక్క పోస్టర్ని విడుదల చేశారు. అలాగే రాబోయే కార్యక్రమాల గురించి మరియు బిజెపి మరియుయువ మోర్చా యొక్క బలేపేతం చేయడం కోసం దిశా నిర్దేశం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా పదాధికారులు మరియు మండల అధ్యక్షులు పాల్గొన్నారు
Arattai