ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా బీజేపీ జనతా వారధి
NANDYAL Aug10 :- నంద్యాల: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా బీజేపీ జనతా వారధి పనిచేస్తుందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు తెలిపారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో, అలాగే పట్టణంలో పలు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురైన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

ప్రజా సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అభిరుచి మధు పేర్కొన్నారు. ప్రజలకు ఎదురయ్యే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి బీజేపీ జనతా వారధి నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
Arattai