శ్రీశైలం పద్మశాలి అన్నదాన సత్రం అధ్యక్షుడు జేరపు చంద్రశేఖర్ ఘన సన్మానం
ATMAKURU Aug10 :- శ్రీశైలం పద్మశాలి అన్నదాన సత్రం అధ్యక్షుడిగా ఆత్మకూరుకు చెందిన జేరపు చంద్రశేఖర్,ఉపాధ్యక్షులుగా గంజి మోహన్ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాకు చెందిన పద్మశాలి సంఘం సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ భీమనపల్లె వెంకటసుబ్బయ్య ,రాష్ట్ర కార్యదర్శి G.V రామయ్య పాల్గొని చంద్రశేఖర్‌ను అభినందించారు. శ్రీశైలం పద్మశాలి అన్నదాన సత్రం అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆయన నాయకత్వం దోహదపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Arattai