లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం
NANDYAL Aug13:- అంతర్జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 12వ తేదీ న ప్రకటించిన లయన్స్ క్లబ్ యువజన పురస్కారాలను గురువారం సాయంత్రం స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో అందజేసి సత్కరించారు.నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316 జె వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. యువత సృజనాత్మక ఆలోచనలతో సమాజాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా నేషనల్ కంప్యూటర్స్ ద్వారా వందలాదిమందికి కంప్యూటర్ శిక్షణ ఇస్తూ, ఉద్యోగ అవకాశాలు కల్పించిన షణ్ముఖ శ్రీనివాస్, ఇంటీరియర్ డిజైనర్ గా విశేష ప్రతిభ చూపిస్తున్న రిత్విక్, సన్ షైన్ సొసైటీ ద్వారా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన పోలూరు జనార్ధన్ లకు లయన్స్ క్లబ్ అంతర్జాతీయ యువజన దినోత్సవ పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్, కార్యదర్శి మేడా చంద్రశేఖర్ కోశాధికారి సురేష్, జోన్ చైర్మన్ సోమేశుల నాగరాజు, ఉపాధ్యక్షులు పోసిన సుబ్బారావు, సీనియర్ సభ్యులు ఎంపీవి రమణయ్య, చంద్రమోహన్, లాలి స్వామి, మామిళ్ల నాగరాజు,తోట శ్రీనివాస్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Arattai