ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన DRO రాము నాయక్
NANDYAL Aug20 :- ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో డి ఆర్ ఓ రాము నాయక్ సమావేశం నిర్వహించారు. నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు సమావేశం జరిగింది.
సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనగా, ఎన్నికల విభాగం అధికారులు సంబంధిత అంశాలను వివరించారు. డి ఆర్ ఓ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పురోగతి, పెండింగ్లో ఉన్న నోటీసుల పంపిణీ, విచారణలు, తుది ప్రచురణ తదితర అంశాలపై సమీక్షిస్తూ వేగవంతం చేయాలన్నారు.

జిల్లాలో మొత్తం 80,283 నోటీసులు జనరేట్ చేయగా, ఇప్పటివరకు 70,615 నోటీసులు పంపిణీ చేసినట్లు వివరించారు. ఇంకా 9,668 నోటీసులు పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే 12,142 విచారణలు పూర్తయ్యాయని, 57,473 విచారణలు పెండింగ్లో ఉన్నాయని, 12,587 కేసులు తుది ప్రచురణ కోసం పెండింగ్లో ఉన్నాయని వివరించారు.
ఫారం-6, ఫారం-7, ఫారం-8 లకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 30, 2026 వరకు అందిన క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

అదేవిధంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాల్లో బూత్ స్థాయి అధికారులు (BLOలు) సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పెండింగ్ ఫిర్యాదులు, ‘బుక్ ఎ కాల్ విత్ BLO’ అంశాలపై కూడా సమావేశంలో సమీక్షించారు.
Arattai