అమ్మ స్పటిక లింగేశ్వర ఆలయంలో ఏరువాక పౌర్ణమి వేడుకల

  1. నంద్యాల పట్టణం,హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అమ్మ స్పటికలింగేశ్వరలయం నందు బుధవారం జేష్ట మాస పౌర్ణమి మరియు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు.ఉదయం యోగానంద ఆధ్వర్యంలో శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్పటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.అనంతరం లోకకళ్యాణార్థం, ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా యోగానంద మాట్లాడుతూ వర్షఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమ నాడు తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారాని తెలిపారు.తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారని తెలిపారు. రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక హోమాలు నిర్వహించినట్లు తెలిపారు.పూర్ణాహుతి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిమ్మయ్య,అనిల్,వెంకట సుబ్బయ్య,రఘునాథ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,యోగ సభ్యులు పాల్గొన్నారు.నంద్యాల పట్టణం,హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అమ్మ స్పటికలింగేశ్వరలయం నందు బుధవారం జేష్ట మాస పౌర్ణమి మరియు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు.ఉదయం యోగానంద ఆధ్వర్యంలో శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్పటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.అనంతరం లోకకళ్యాణార్థం, ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా యోగానంద మాట్లాడుతూ వర్షఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమ నాడు తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారాని తెలిపారు.తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారని తెలిపారు.
    రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక హోమాలు నిర్వహించినట్లు తెలిపారు.పూర్ణాహుతి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిమ్మయ్య,అనిల్,వెంకట సుబ్బయ్య,రఘునాథ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,యోగ సభ్యులు పాల్గొన్నారు.

పోలీసు సేవలు సమాజానికి ఆదర్శం : జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.