NANDYAL Nov 28-11-25:- వసతిగృహాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సోషల్ వెల్ఫేర్ అధికారులకు సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వసతి గృహాలలో వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ….జిల్లాలోని అన్ని వసతి గృహాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులను వార్డెన్ లు తమ కన్నబిడ్డల్లా చూసుకోవాలని ఎటువంటి సంఘటనలు జరిగినా వసతి గృహాల సంక్షేమ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

జిల్లాలోని వసతి గృహాలకు 28 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లు మంజూరయ్యాయని ఇవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇంకా పాఠశాలలలో, వసతి గృహాలలో జరుగుతున్న భవన నిర్మాణ పనులు కాంపౌండ్ వాల్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి అందుకు సంబంధించిన బిల్లులను ఆర్డబ్ల్యూఎస్ లాగిన్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఇకనుంచి హాస్టల్ లను తరచూ విజిట్ చేయడం జరుగుతుందని వసతి గృహాలలో విద్యార్థుల నుంచి ఎటువంటి అసంతృప్తి తలెత్తకుండా వార్డెన్లు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, సోషల్ వెల్ఫేర్ డిడి చింతామణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Arattai