నంద్యాల పట్టణంలో పురాతనమైన ప్రముఖ ఆలయం శ్రీ ప్రమదనందీశ్వర స్వామి దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన ధర్మకర్తల మండలిని నియమించింది. చైర్మెన్ గా నంద్యాలకు చెందిన చీకటి వెంకట చలం బాబును ఎంపిక చేశారు. సభ్యులుగా బుడమకాయల రామకృష్ణా రెడ్డి, చెరుకుపల్లి శివ వరప్రసాద్, లక్ష్మీదేవి, చెరుకూరి హుస్సేనమ్మ, సుబ్బయ్య, బోయిన సుమలత, ఎక్స్ అఫిషియల్ సభ్యులుగా రాఘవేంద్ర శర్మ లను నియమించారు. 5వ తేదీ సోమవారం ఉదయం పదిన్నర గంటలకు దేవాలయం ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మైనారిటీసంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా, గౌరవ అతిధులుగా జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ ఏవి సుబ్బారెడ్డి విశిష్ట అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి. ఫిరోజ్, పట్టణ ప్రముఖులు, నాయకులు హాజరవుతారని చలం బాబు తెలిపారు
I’m Vasu, a journalist with 20 years of experience, now bringing you news through Nandi News.
Arattai