NANDYAL April 08 :- నంద్యాల పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం నందు బుధవారం సామాజిక సమరసత సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ వినాయకరావు దేశ్ పాండే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ భీమ్ రామ్ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన వాడు కాదని,వారు యావత్ భారతదేశానికి చెందినటువంటి అభిమాన నాయకుడని,యావత్ భారతజాతిని జాతీయత భావముతో ముందుకు నడిపిన నాయకుడు అంబేద్కర్ గారు అని,బలవంతపు మతమార్పిడులను ప్రోత్సహించటం భారతదేశనికి మంచిది కాదని స్వతంత్ర రాక పూర్వమే బాహాటంగా చెప్పిన ఏకైక నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వారు తెలిపారు.
బాబు జగ్జీవన్ రామ్ గారు 50 సంవత్సరాలు వరుసగా ఎంపీగా ఉంటూ ప్రపంచ రికార్డును సృష్టించారు వారు కూడా సామాజిక సమరసత కోసం పోరాడారు.దాంతోపాటు బలవంతపు మతమార్పిడులను వారు అడ్డుకున్నారు వారు బాల్యం నుంచే అంటరానితనాన్ని ఎదిరించారు అంతటి గొప్ప వ్యక్తి ఏ ఒక్క కులానికి ఏ ఒక్క మతానికి ఆపాదించడం సరికాదని బాబు జగ్జీవన్ ప్రజా నాయకుడని వారు కొనియాడారు.
బాబు జగ్జీవన్ రామ్,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గార్ల జయంతులను విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం చేస్తుందని,గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత వైభవోపేతంగా చేయబోతుందని ప్రాంత ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి గారు అన్నారు
ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు బెనర్జీ గారు మాట్లాడుతూ మతం మారి వెళ్లిన దళిత సోదరులు తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని స్వధర్మం కంటే మించింది మరేది లేదని ప్రపంచంలో భారతదేశం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలంటే బలవంతపు మతమార్పిడులు ఉండకూడదని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ కుల సంఘాల నాయకులు, రిటైల్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు విశ్వ హిందూ పరిషత్ జిల్లా మరియు ప్రఖండ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
Arattai