NANDYAL April 30 :- కళారాధన సాంస్కృతిక సంస్థ, నంద్యాల ఆధ్వర్యంలో, నంద్యాల ఐఎంఏ, నంద్యాల మహిళా వైద్యుల విభాగం,నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త సహకారంతో గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత లలిత కళలు,క్రీడల వేసవి శిక్షణ శిబిరం 25 వ సంవత్సరం మే ఒకటవ తేదీ నుండి జూన్ 2 వ తేదీ వరకు “కళా సాధన -2026” పేరిట నంద్యాల కే.ఎన్.ఎం. మున్సిపల్ స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవి కృష్ణ గురువారం స్థానిక కళారాధన కార్యాలయంలో శిక్షణ ఇచ్చే కోచ్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ రావు ,డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ పూర్తి ఉచితంగా శిక్షణ ఇస్తున్నప్పటికీ, కోచ్ లు సమయపాలన పాటిస్తూ, నిబద్ధతతో పిల్లలకు లలిత కళలలో ఆసక్తి పెంచే విధంగా శిక్షణ శిబిరం కొనసాగాలని ఆకాంక్షించారు. కోచ్ లకు కళారాధన తరుపున గౌరవ పారితోషకం ప్రతి సంవత్సరం లాగానే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఉదయం కోచ్ లకు అల్పాహారం నెలరోజుల పాటు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఈ శిక్షణ శిబిరం లో శాస్త్రీయ నృత్యం,ఆధునిక నృత్యం, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం ,వాద్య సంగీతంలో గిటార్,కీబోర్డ్,మిమిక్రీ,వెంట్రిలాక్విజం,చిత్రలేఖనం,చక్కటి చేతివ్రాత ,హస్తకళలు,ఫ్యాబ్రిక్ పెయింటింగ్,పద్య పఠనం, సంస్కృత శ్లోకాలు,కవితా గానం,కవితా రచన, చదరంగం,కరాటే, టైక్వాండో, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలలో 32 మంది కోచ్ లతో శిక్షణా శిబిరాలు నిర్వహించడం జరుగుతాయని తెలిపారు.

జూన్ రెండవ తేదీన ముగింపు ఉత్సవం లో శిక్షణ పొందిన బాలబాలికల చేత ప్రదర్శనలు నంద్యాల ఐఎంఏ, నంద్యాల మహిళా వైద్య విభాగం, నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని, శిబిరంలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రం అందజేస్తామని తెలిపారు. శిబిరంలో శిక్షణ పొందడానికి, ముగింపు ఉత్సవంలో ప్రదర్శనలు ఇవ్వడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.వేసవి సెలవులను బాలలు, యువత సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరారు. కళలు, క్రీడలు విద్యార్థుల మానసిక, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు
మీక్షా సమావేశంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు,కళారాధన కార్య నిర్వాహాక కార్యదర్శులు అన్నెం శ్రీనివాసరెడ్డి,రంగనాథ్, కోఆర్డినేటర్లు మజీద్ మున్నా, మధు,వెంకటేశ్వర్లు కోచ్ లు కళ్యాణి, లలితా సరస్వతి, సుభాషిని,రజాక్, సుదర్శనం, బాలకృష్ణ, నాగేంద్ర, రాజేంద్ర, శివకుమార్, సతీష్ ,మధు, రాజా ,ఆది, తరుణ్, సీతారాం, రాజ్ కుమార్, సత్యనారాయణ పాల్గొని శిబిరం విజయవంతానికి పలు సూచనలు చేశారు.
శిక్షణ శిబిరంలో శిక్షణ పొందదలిచిన విద్యార్థులు మే 1వ తేదీ ఉదయం ఏడు గంటలకు నేరుగా శిబిరం నిర్వహించే స్థలానికి రావాలని కోరారు. ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:8142962974,7989627760,6300715927
Arattai