NANDYAL May13 :- నంద్యాల పట్టణంలో వెలసిన శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవాలయం నందు నిన్నటి రోజున హనుమాన్ జయంతి వేడుకలను మంత్రి ఫారుక్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.40 సంవత్సరాల తర్వాత స్వామివారి నిజరూప దర్శనము, క్షీరాభిక్షేకము ,ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రధాన అర్చకులు సుబ్బయ్య మరియు శివ స్వామి విశిష్ట పూజలు నిర్వహించారు. ఉదయం 5:30 కి గంటలకి స్వామి వారి క్షీరాభిషేకానికి చైర్మన్ డాక్టర్ వి అనిల్ కుమార్ , ఈ.వో వేణునాధ రెడ్డి మరియు ఐఎంఏ వైద్యులు 5000 మంది భక్తులు హాజరయ్యారు మధ్యాహ్నం 12 గంటలకి మహా నైవేద్యం స్వామి అన్నప్రసాద వితరణకు 3000 మంది హాజరయ్యారు. ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు

సాయంత్రం ఎంపీ శబరి స్వామిని దర్శించుకున్నారు మరియు ఈ ఆలయఅభివృద్ధి కోసం చైర్మన్ డాక్టర్ వి అనిల్ కుమార్ మరియు ఈ.వో వేణునాధరెడ్డితో చర్చించి వారికి తదువిదంగా సహాయం చేస్తాను అని తెలియజేశారు సాయంత్ర 6 గంటలకి ఫరూక్ గారి తనయుడు ఫయాజ్ స్వామిని దర్శించుకొని గ్రామోత్సవం ప్రారంభించడం జరిగినది. రాత్రి 10 గంటలకు మహా మంగళ హారతులతో స్వామి వారి జన్మదిన వేడుకలు ముగిశాయి. 50వేల మంది భక్తులు స్వామి దర్శన భాగ్యం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ఎంపీ శబరి కి , ఫయాజ్ కి, దేవస్థానం సిబ్బంది కి , చైర్మన్, కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రతి అమావాస్య రోజు ఆంజనేయ స్వామి నిజరూప దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుందని దేవస్థానం చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు
Arattai