NANDYAL June 08:- గ్యాస్,పెట్రోల్,డీజల్ అధిక ధరలు తగ్గేవరకు ప్రజా పోరాటాలు ఆగవని RSP నంద్యాల జిల్లా కార్యదర్శి అప్పపోగు సుబ్బారాయుడు తెలిపారు.

నంద్యాల పట్టణంలోని ఆర్ ఎస్ పి కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి నిరసన కార్యక్రమము చేపట్టారు. ఆర్ ఎస్ పి పార్టీ నాయకులు రాష్ట్ర సమితి సభ్యులు షేక్ బాషా గోపాలకృష్ణ సలీం భాష మహిళా మండలి లక్ష్మీ మున్ని మేరీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద మధ్యతరగతి ప్రజలపై ఎడాపెడగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచి పారేశారనీ తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు వాడే నిత్యవసర సరుకులపై ప్రభావం చూపుతున్నది. వంటనూనె ,కారం కందిపప్పు నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోయాయనీ. దీని ఫలితంగా పేదలు కొనుగోలు శక్తి తగ్గిందనీ కావున తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలని ఆర్ఎస్పి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు
రాజేంద్ర కుమార్ ,నంది న్యూస్ రిపోర్టర్
Arattai