NANDYAL June 06:- నంద్యాల పట్టణంలో గల శ్రీరామకృష్ణ డిగ్రీ & పి.జి. కళాశాలలో నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు 4వ జాతీయ స్థాయి ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్ శ్రీ ప్రవీణ్ సుశాంత్ తెలిపారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో
ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం (Inaugural function) ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు ఎన్.ఎమ్.డి. ఫరూక్,శ్రీరామకృష్ణ డిగ్రీ & పి.జి. కళాశాల చైర్మన్ డా॥ జి. రామకృష్ణారెడ్డి,
కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Curling Federation of India) జనరల్ సెక్రటరీ శ్రీ మొహమ్మద్ అర్షద్ పాల్గొన్నారు.

ఈ పోటీలలో దేశవ్యాప్తంగా సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.విద్యార్థులందరికీ భోజన మరియు వసతి సౌకర్యాలను శ్రీరామకృష్ణ డిగ్రీ & పి.జి. కళాశాల వారు ఏర్పాటు చేశారు.ఈ పోటీలలో గెలుపొందిన వారు త్వరలో జరగబోయే వరల్డ్ ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్ షిప్ (World Floor Curling Championship) పోటీలలో పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా క్రీడా వికాస పరిషత్ జిల్లా అధ్యక్షులు ఎస్. సుధాకర్, సెక్రటరీ నిమ్మకాయల సుధాకర్, ఆర్గనైజర్లు సుశాంత్ మరియు ఇతరులు, స్టేట్ ప్రెసిడెంట్ వై. వెంకటేశ్వర్రావులు పాల్గొన్నారు.
రాజేంద్ర కుమార్, నంది న్యూస్ రిపోర్టర్
Arattai