NANDYAL June 08:- శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి), నంద్యాల వారి ఆధ్వర్యంలో మిడెన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించింది.

ఈ నియామక కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డా. జి. రామకృష్ణ రెడ్డి, డైరెక్టర్ డా. జి. హేమంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ కె.బి.వి. సుబ్బయ్య, విభాగాధిపతి డా. యు.వి.ఎస్. కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారులు కె. సంపత్ మరియు ఎస్. ఇంతియాజ్ అహమ్మద్ పర్యవేక్షణ అందించారు. కంపెనీ తరఫున మామిళ్ల సుభాష్ (జనరల్ మేనేజర్), యదు బాలకృష్ణన్ (అసిస్టెంట్ మేనేజర్), మనోహర్ రెడ్డి (అసోసియేట్ మేనేజర్) మరియు థిమేష్ (టీమ్ లీడ్) పాల్గొని నియామక ప్రక్రియను నిర్వహించారు.
ఈ ప్లేస్మెంట్ డ్రైవ్‌లో డిగ్రీ మరియు పీజీ కోర్సులకు చెందిన మొత్తం 95 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూ మరియు హెచ్ఆర్ రౌండ్ అనే రెండు దశలను నిర్వహించారు. మొదటి దశలో జరిగిన ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూలో 45 మంది విద్యార్థులు అర్హత సాధించి హెచ్ఆర్ రౌండ్‌కు ఎంపికయ్యారు. అనంతరం జరిగిన హెచ్ఆర్ ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచిన 14 మంది విద్యార్థులు మిడెన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కు ఎంపిక అయ్యారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డా. జి. రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించేలా కళాశాల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. డైరెక్టర్ డా. జి. హేమంత్ రెడ్డి ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ, వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.
ప్రిన్సిపాల్ కె.బి.వి. సుబ్బయ్య, విభాగాధిపతి డా. యు.వి.ఎస్. కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారులు కె. సంపత్ మరియు ఎస్. ఇంతియాజ్ అహమ్మద్‌లు ఎంపికైన విద్యార్థులను అభినందించి, ఈ అవకాశాన్ని కల్పించిన మిడెన్ ల్యాబ్స్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజేంద్ర కుమార్,నంది న్యూస్ రిపోర్టర్
Arattai