NANDYAL June26 :- మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాలలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ (ASP) మందా జావా లి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మందా జావా లి మాట్లాడుతూ… యువత మాదక ద్రవ్యాల (డ్రగ్స్) దుర్వినియోగంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు: మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు ఎలా చిన్నాభిన్నం అవుతాయో, అవి శారీరక, మానసిక ఆరోగ్యంపై చూపే తీవ్ర దుష్ప్రభావాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు.విద్యపై శ్రద్ధ: క్షణికానందానికి లోనై బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, విద్యార్థులంతా కేవలం చదువుపైనే పూర్తి శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె సూచించారు.

ఈ సదస్సులో శ్రీరామకృష్ణ విద్యాసంస్థల అకాడమిక్ డీన్ ప్రగతి రెడ్డి గారు పాల్గొని ప్రసంగిస్తూ, విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని, డ్రగ్స్ వంటి సామాజిక జాడ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai