NANDYAL June27 :- నంద్యాల పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాపై అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.ఈగల్ క్లబ్ మరియు జాతీయ సేవా పథకం (NSS) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమై పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది.

ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శశికళ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రామలింగారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai