NANDYAL:- నంద్యాల పట్టణంలోని అమర యోగ వికాస కేంద్రంలో సోమవారం జేష్ఠ మాస పౌర్ణమి,ఏరువాక పౌర్ణమి సందర్భంగా యోగానంద ఆధ్వర్యంలో శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.

అనంతరం లోకకళ్యాణార్థం ప్రత్యేక హోమాలను నిర్వహించారు. ప్రపంచ శాంతి, ప్రజల ఆయురారోగ్యాలు,దేశ సుభిక్షం,సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని సంకల్పంతో హోమాలు నిర్వహించినట్లు యోగానంద తెలిపారు.అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో తిమ్మయ్య,అనిల్,రఘునాథ్ రెడ్డి,వెంకటేశ్వరరెడ్డి, యోగ సభ్యులు పాల్గొన్నారు.
Arattai