NANDYAL June 01 :- స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బి.సి రాయి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించే జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని మరియు నంద్యాల ప్రధమ ఈఎన్టీ వైద్యులు దివంగత డాక్టర్ సత్యనారాయణ జ్ఞాపకార్థం, నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఎ సహకారంతో తిరుమల పునీత్ ఈ ఎన్ టి మరియు స్కిన్ ఆసుపత్రి నిర్వహణలో, రాష్ట్ర ప్రభుత్వ పిలుపుమేరకు పి 4 కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉచిత చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించారు.

నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఎం డి ఫిరోజ్ డాక్టర్ సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ నంద్యాల వైద్యులు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ,దివ్యాంగులకు, దేశ రక్షణలో పనిచేస్తున్న త్రివిధ దళాల ఉద్యోగుల కుటుంబాలకు ఉచిత ఓ పి డి సేవలు అందిస్తూ రాష్ట్రంలోని వైద్యులకు ఆదర్శప్రాయంగా నిలిచారని అభినందించారు.

ఎన్ ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ వైద్య సేవలే కాకుండా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో వైద్యులు ముందు ఉండడం ప్రశంసనీయమన్నారు. వైద్యుల దినోత్సవం వేడుకలలో భాగంగా ఫిరోజ్ కేక్ కట్ చేసి వైద్యులకు అందించారు.

ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర మాజీ ఐఎంఏ అధ్యక్షులు, లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా తిరుమల పునీత్ ఈఎన్టి స్కిన్ ఆసుపత్రి తరఫున డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ భార్గవర్ధన రెడ్డి, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ విజయబాబు, నంద్యాల మహిళా వైద్యుల విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, వెలాసిటీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ లకు వైద్యుల దినోత్సవ పురస్కారాలు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అందించి సత్కరించారు.వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యురాలైన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని నంద్యాల ఐఎంఏ మహిళా వైద్యులు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రోటరీ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి, ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ మహమ్మద్ రఫీ, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, డాక్టర్ నాగమణి,డాక్టర్ నర్మద, డాక్టర్ లలిత, ప్రజలు పాల్గొన్నారు.

విజయవంతమైన వైద్య శిబిరం:
ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ చెవి ముక్కు గొంతు వైద్యులు ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ అనిల్ కుమార్,ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యురాలు చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ హరిత దాదాపు 300 మంది రోగులను పరీక్షించి, ఉచితంగా లక్ష రూపాయలు విలువచేసే మందులు పంపిణీ చేశారు.70 మందికి అవసరమైన వినికిడి పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహించడం జరిగింది.
Arattai