NANDYAL July03:- నంద్యాల లయన్స్ క్లబ్ 2026 -27 సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం రామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహిస్తున్నారు. అధ్యక్షులుగా ముదియనూర్ సందీప్ కుమార్,కార్యదర్శిగా మేడా చంద్రశేఖర్,కోశాధికారిగా సురేష్ లతో పాటు మిగిలిన కార్యవర్గంతో లయన్స్ జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ ప్రమాణస్వీకారం చేయిస్తారు. రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి,శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి, ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు అతిధులుగా పాల్గొంటున్నారు.

శుక్రవారం లయన్స్ క్లబ్ కార్యాలయంలో ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ తో పాటు గత సంవత్సర కాలంగా సేవలందించిన అధ్యక్ష కార్యదర్శులు సోమేశుల నాగరాజు, తాతి రెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్, నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడిన సందీప్, మేడా చంద్రశేఖర్, సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ 1970 సంవత్సరంలో ప్రారంభించబడిందని, గత 56 సంవత్సరాలుగా నంద్యాల లయన్స్ క్లబ్ ప్రజలకు అనేక రకాల సేవా కార్యక్రమాల్ని నిరంతరంగా కొనసాగిస్తూ వస్తున్నదని అన్నారు. గత సంవత్సర కాలంగా నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరించిన సోమేశుల నాగరాజు, తాతి రెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్ 100 సేవా కార్యక్రమాలను నిర్వహించి నంద్యాల లయన్స్ క్లబ్ ప్రతిష్టను ఇనుమడింప చేశారని అభినందించారు.
నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎంపికైన సందీప్, చంద్రశేఖర్, కోశాధికారి సురేష్ మాట్లాడుతూ రానున్న సంవత్సర కాలంలో లయన్స్ క్లబ్ తరఫున సామాజిక సేవా కార్యక్రమాలు,దివ్యాంగులకు, వృద్ధులకు సహాయ కార్యక్రమాలు,పర్యావరణ,విద్య ,సాంస్కృతిక ,క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
Arattai