NANDYAL July 08:- నంద్యాల జిల్లా నంద్యాల పట్టణము, ప్రతి ఏటా జులై 01 వ తేదీ నుండి జులై 31 వ తేదీ వరకు జరుపుకునే జాతీయ డెంగ్యూ మాసోత్సవము పురస్కరించుకుని ఈ రోజు నంద్యాల పట్టణము నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించబడింది.

ఉదయం 9:00 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయము నుండి జిల్లా DMHO శ్రీ డాక్టర్ వెంకటరమణ గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటరమణ , వైద్య సిబ్బంది, ANMలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, సుమారు 100 మంది పాల్గొన్నారు. బుధవారం ఉదయం 9.గంటలకు డెంగ్యూ నివారణకు “చెక్” “క్లీన్ ” ” కవర్ ” వంటి 3 సులభమయిన ఆచరణ మార్గాలు పాటిస్తూ దోమల నిర్ములన నినాదాలతో ర్యాలీ సాయిబాబా నగర్ ఆర్చి వరకు సాగింది.

ర్యాలీ అనంతరం RR నర్సింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన సదస్సులో DMO సి. చంద్రశేఖర్ రావు గారు మాట్లాడుతూ, డెంగ్యూ వ్యాధి ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుందని, ఈ దోమలు పగటిపూట కుడతాయని, నిల్వ ఉన్న మంచినీటిలో గుడ్లు పెడతాయని తెలిపారు. వ్యాధి లక్షణాలు: తీవ్ర జ్వరం, తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు. లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
- ప్రతి శుక్రవారం డ్రై డే ఉదయము 10 నిమిషాలు కేటాయించి ఇంట్లో, పరిసరాల్లో నీటి నిల్వలను పారబోయాలి.
- నీటి ట్యాంకులు, డ్రమ్ములు మూత పెట్టి ఉంచాలి.
- పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పూల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
- పగటిపూట దోమ తెరలు, దోమల నివారణ క్రీములు వాడాలి.
- పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.
ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి సి. చంద్రశేఖర్ రావు , ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ కె ఎస్ పి శ్రీనివాసులు , డాక్టర్ ప్రసన్న. డెమో మల్లే పల్లె పామన్న, వెంకటేశ్వర రెడ్డి , వంశీ (SUO) మరియు MPHA(M), ANM , ల్యాబ్ టెక్నిషన్స్ , ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొని డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కరపత్రాలు, పోస్టర్లు HB VY పంపిణీ చేశారు.
Arattai