NANDYAL July15 :- నంద్యాల పట్టణం,శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి), ఈనెల 17వ తేదిన Muthoot Microfin Ltd.! వారి క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్
శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి), నంద్యాలలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో 17-07-2026 (శుక్రవారం) ఉదయం 9:30 గంటలకు శ్రీ స్వామి వివేకానంద ఆడిటోరియంలో Muthoot Microfin Ltd.! వారి చే క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణ రెడ్డి తెలిపారు.ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో ఇంటర్మీడియట్ (12వ తరగతి ఉత్తీర్ణులు) మరియు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళలు, ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ అర్హులు అని తెలిపారు.

ఉద్యోగ వివరాలు:
• అర్హత: ఇంటర్మీడియట్ / ఏదైనా డిగ్రీ
• వయస్సు: 18–30 సంవత్సరాలు
• జీతం: నెలకు ₹19,000
• ఇతర ప్రయోజనాలు: ఫ్యూయల్ అలవెన్స్, ఆకర్షణీయమైన ఇన్సెంటివ్స్, హెల్త్ ఇన్సూరెన్స్
• ఉద్యోగ ప్రాంతాలు: నంద్యాల, గిద్దలూరు, నందికొట్కూరు, వెల్దుర్తి, గూడూరు, కోవూరు మరియు కావలి
• మొత్తం ఖాళీలు: 30
అభ్యర్థులకు సొంత ద్విచక్ర వాహనం మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (DL) లేదా లెర్నర్ లైసెన్స్ (LLR) తప్పనిసరిగా ఉండాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, డ్రైవింగ్ లైసెన్స్/ఎల్ఎల్ఆర్తో ఉదయం 9:30 గంటలకే వేదిక వద్ద హాజరు కావాలని కోరారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కె.బి.వి. సుబ్బయ్య మరియు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ యు.వి.ఎస్. కుమార్, సంపత్ కుమార్ లు మాట్లాడుతూ అర్హత కలిగిన విద్యార్థులు మరియు ఉద్యోగార్థులు ఈ అరుదైన ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
The Registration Link is “https://forms.gle/8iujqosazSb5tuZe6”
Arattai