యోగ చైతన్య కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలు
NANDYAL July29 :- నంద్యాల పట్టణంలోని యోగ చైతన్య కేంద్రం నందు బుధవారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యోగా చార్య రాపర్తి రామారావు గారికి, శిష్యులు గురుపూజను ఘనంగా నిర్వహించారు.

మోక్షమార్గానికి యోగమార్గమే సులువైన మార్గమని వారు తెలిపారు.గురువుల మార్గదర్శకత్వంలో యోగ సాధన చేస్తే జీవితంలో ప్రశాంతత, ఆత్మజ్ఞానం కలుగుతాయని యోగశిక్షకుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా యోగా చార్య రాపర్తి రామారావు గారి శిష్యులు,యోగా సాధకులు ,యోగ చైతన్య కేంద్రం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని గురుపౌర్ణమి సందర్భంగా గురువుకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు.
Arattai