ఈనెల 7 నుండి 13 వరకు నంద్యాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు
NANDYAL Aug03:- నంద్యాల పట్టణంలో ఈ నెల7వ తేదీ నుండి 13వ తేదీ వరకు జిల్లా స్థాయి క్రీడ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి MNV రాజు తెలిపారు.12 క్రీడ అంశాలలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీ నిర్వహించే జాతీయ క్రీడ దినోత్సవం పురస్కరించుకుని ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నియోజకవర్గస్థాయిలో ఎన్నికైన క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలని కోరారు
ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి MNV రాజు మాట్లాడుతూ జూలై 15 నుంచి 31 తేది వరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో అమరావతి ఛాంపియన్షిప్- 2026 ఎంపిక పోటీలు నిర్వహించామని తెలిపారు. నియోజకవర్గస్థాయి నుండి ఎంపికైన క్రీడాకారులు ఈనెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆర్చరీ,అథ్లెటిక్స్,బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్,చెస్,హాకీ, కబడ్డీ, కోకో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగ, వంటి 12 క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Arattai