జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా రూ.10.20 లక్షల బ్యాంక్ లింకేజీ మెగా చెక్కు పంపిణీ
NANDYAL Aug07:- జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలోని ఏడు స్వయం సహాయక సంఘాలకు చెందిన ఎనిమిది మంది సభ్యులకు బ్యాంక్ లింకేజీ ద్వారా మొత్తం రూ.10.20 లక్షల రుణానికి సంబంధించిన మెగా చెక్కును జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చేనేత కార్మికులు మరియు స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే బ్యాంక్ లింకేజీ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.లబ్ధిదారులు మంజూరైన రుణాలను సక్రమంగా వినియోగించుకుని తమ జీవనోపాధిని విస్తరించుకోవాలని, నెలకు కనీసం రూ.15 వేలకుపైగా నికర ఆదాయం పొందేలా ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ వై.బి. శ్రీధర్ రెడ్డి, సంజామల మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులు అనురాధ, బాల చౌడమ్మ తదితరులు పాల్గొన్నారు.
Arattai