ఈనెల 22, 23వ తేదీలలో నంద్యాలలో ప్రధమ రాయలసీమ జోనల్ తైక్వాండో పోటీలు
NANDYAL Aug18 :- ఉమ్మడి కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22,23వ తేదీలలో నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ప్రధమ రాయలసీమ జోనల్ స్థాయి తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ క్రీడా పోటీలు ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్. టి . చంద్రమౌళి, జిల్లా కార్యదర్శి సర్దార్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా మంగళవారం స్థానిక క్రీడా సమాఖ్య కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్స్ ను ఉమ్మడి కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ చైర్మన్,అంతర్జాతీయ లయన్స్ సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ, పోటీల నిర్వాహక కార్యదర్శి రియాజ్, కోచ్ లు బాలకృష్ణ, షానవాజ్ లతో కలసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ లో తైక్వాండో క్రీడ ఒలింపిక్స్ లో గుర్తింపు పొందిన క్రీడ అన్నారు. తైక్వాండో లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు టోర్నమెంట్ లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి బహుమతులు సాధించాలని కోరారు. టోర్నమెంట్ లో పాల్గొనడం ద్వారా తమ ప్రావీణ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు.23వ తేదీ ఆదివారం సాయంత్రం విజేతలకు బహుమతులు అందజేస్తారని తెలిపారు.
Arattai