మున్సిపాలిటీ వారిగా ఫొటో,ఓటర్ల జాబితా ప్రచురణకు సన్నద్ధత ఉండాలి: జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా
NANDYAL Aug18 :- మునిసిపాలిటీ వారిగా వారీగా ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణకు అవసరమైన సన్నద్ధత చర్యలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా ఆరు నియోజకవర్గ మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోనే కలెక్టర్ ఛాంబర్ నందు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, త్రాగునీటి సరఫరా కొరకు చేపట్టవలసిన చర్యలు, పరిశుభ్రత పై జెడ్పి సీఈవో సుబ్బారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిని లలితా బాయి, ఆరు మున్సిపాలిటీల మున్సిపల్ కమిషనర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఫోటో, ఓటర్ల జాబితాను సిద్ధం చేసి 03-09-26 వ తేదీన సంబంధిత కార్యాలయాల్లో ప్రచురించాలని ఆదేశించారు.గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల పరిశీలన మరియు ప్రచురణ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు కార్యక్రమం 18.08.2026 నుండి ప్రారంభం అవుతుందని తెలిపారు.
జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో తాగునీటి సరఫరాపై మందస్తు చర్యలు తీసుకొని ఎక్కడ కూడా త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను జిల్లాలో పగడ్బందీగా చేపట్టాలని స్వచ్ఛతపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు.
Arattai