నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
NANDYAL Sep05 :- నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ప్రిన్సిపల్ శశికళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అనంతపురం ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ మురళీధర్ హాజరయ్యారు.మురళీధర్ నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించడమే కాకుండా,1984-91 వరకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాస్త్ర అధ్యాపకులుగా సేవలందించడం విశేషమని వారు తెలిపారు

కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి. జె. శైలజా రాణి గారు, IQAC కోఆర్డినేటర్ శ్రీ కె. చంద్రమోహన్ గారు, NSS కోఆర్డినేటర్ విజయానంద్, ఫిజికల్ డైరెక్టర్ కె. శ్రీనివాసులు, అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. శశికళ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశంలో ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త మరియు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించబడుతుందని తెలిపారు. విద్యార్థుల జీవితాలను సరైన మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కేవలం విద్యను బోధించడమే కాకుండా, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన పౌరసత్వం మరియు సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తారని వివరించారు.ప్రత్యేక అతిథి డాక్టర్ మురళీధర్ గారు కూడా విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల గౌరవం, క్రమశిక్షణ, కష్టపడి చదివే తత్వం మరియు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
Arattai