నంద్యాల బాల అకాడమీ ప్రిన్సిపాల్ మాధవీలత కి ప్రతిష్ఠాత్మక పురస్కారం
NANDYAL Sep07:-విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, విద్యారంగంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతూ, పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న బాల అకాడమీ ప్రిన్సిపాల్ మాధవీలత కి ప్రతిష్ఠాత్మక ‘శిక్షా రత్న అవార్డు–2026 లభించింది.ఉపాధ్యాయ దినోత్సవం–2026 సందర్భంగా హరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాధవీలత విద్యారంగంలో ఆమె అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు మరియు విద్యా రంగంలో నూతన మార్పులకు కృషి చేస్తున్న విద్యావేత్తలను గుర్తించి అందించే ఈ పురస్కారం మాధవీలత కి దక్కడం బాల అకాడమీకి గర్వకారణంగా నిలిచింది.విద్యను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా, విద్యార్థుల్లో ప్రతిభ, సృజనాత్మకత, క్రమశిక్షణ, విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా నూతన ఆలోచనలను అమలు చేస్తూ ఆమె పాఠశాల ప్రగతికి విశేషంగా కృషి చేస్తున్నారు. విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా పలు విద్యా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఈ అవార్డు నా వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు… బాల అకాడమీ కుటుంబంలోని ప్రతి ఉపాధ్యాయుడు, విద్యార్థి, తల్లిదండ్రుల సమిష్టి కృషికి దక్కిన గుర్తింపు” అని పేర్కొన్నారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
“ఒక మంచి విద్యార్థిని తీర్చిదిద్దడం అంటే ఒక మంచి భవిష్యత్తును నిర్మించడం” అనే స్ఫూర్తితో పనిచేస్తున్న మాధవీలత కి శిక్షా రత్న పురస్కారం లభించడం పట్ల బాల అకాడమీ యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ పురస్కారం బాల అకాడమీ విద్యా ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచిందని, మాధవీలత సాధించిన ఈ ఘనత విద్యా రంగంలో మరింత ఉత్తేజంతో ముందుకు సాగేందుకు స్ఫూర్తినిస్తుందని వారు పేర్కొన్నారు.
Arattai